ట్రోలింగ్ ఆటగాళ్లను దెబ్బతీస్తోంది : కేఎల్ రాహుల్

by Vinod kumar |   ( Updated:2023-05-17 12:28:31.0  )
ట్రోలింగ్ ఆటగాళ్లను దెబ్బతీస్తోంది : కేఎల్ రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రోలింగ్‌పై టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోలింగ్ కారణంగా తాను తీవ్రంగా బాధపడటంతో పాటు ఇతర ఆటగాళ్ల కూడా చాలా ప్రభావితమయ్యారని తెలిపాడు. తొడ కండరాల గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరమైన కేఎల్ రాహుల్ శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను తెగ విసిగించాడు. దాంతో అతనిపై ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. రాహుల్ త్వరగా ఔటైతేనే మేలని కామెంట్లు చేశారు. అందరిలానే ట్రోలింగ్‌కు పట్టించుకోకపోయినా కొన్నిసార్లు బాధపడిన సందర్భాలున్నాయని రాహుల్ చెప్పుకొచ్చాడు.

"హద్దులు ధాటిన ట్రోలింగ్‌ కొన్నిసార్లు బాధపెట్టింది. నేనే కాదు ఇతర ఆటగాళ్లు కూడా ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డారు. అథ్లెట్స్‌గా మేం అభిమానుల మద్దతు ఆశిస్తాం. కానీ కొందరు మాత్రం ఆటగాళ్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ తిట్టడమే వారి హక్కుగా భావిస్తారు" అని రాహుల్ చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. అప్పటి నుంచి అదే తడబాటును కొనసాగిస్తున్న రాహుల్.. ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు.

Also Read..

IPL 2023: అతడు ఔటైతే ముంబైకి ఓటమే.. ఫ్యాన్స్ కామెంట్స్

Advertisement

Next Story