- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లైయన్ బౌలింగ్ అద్భుతం: టీమిండియా కెప్టెన్ రోహిత్
దిశ, వెబ్ డెస్క్: ఆసిస్ స్పిన్నర్ నేథన్ లైయన్ బుల్లెట్ లాంటి బంతులు తమ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ప్రణాళికలను అనుకున్న రీతిలో అమలు చేయలేకపోయామని అతను పేర్కొన్నాడు. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి ఘోర పరాభవమేమీ కాదని తెలిపాడు. తమ బృందమంతా కలిసి ఆటతీరుపై సమీక్షించుకుంటామని వెల్లడించాడు. మూడో టెస్టులో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ మీడియాతో మాట్లాడాడు. కఠిన పిచ్ పై ఆడుతున్నప్పుడు సరిగ్గా బౌలింగ్ చేయాలన్నాడు.
తాము ప్రత్యర్థి బౌలర్లను ఒకే చోట బంతులేసేందుకు ప్రాధాన్యమిచ్చామని తెలిపాడు. అయితే, ఈ ఘనతకు వారు అర్హులేనని, ప్రత్యేకించి నేథన్ లైయన్ బౌలింగ్ అద్భుతమని పొగిడాడు. అనుకున్న వ్యూహాలను ఒకేరీతిలో అమలు చేయనప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయని రోహిత్ తెలిపాడు. ఒక టెస్టు మ్యాచ్ ఓడిపోయామంటే అందుకు చాలా కారణాలే ఉంటాయని చెప్పుకొచ్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సరిగ్గా చేయలేదని కెప్టెన్ రోహిత్ తెలిపాడు.