సెమీస్‌కు చేరుకున్న లక్ష్యసేన్

by Harish |
సెమీస్‌కు చేరుకున్న లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 20-22, 21-16, 21-19 తేడాతో సింగపూర్ షట్లర్ లీ జి జియా‌పై విజయం సాధించింది. గంటా 11 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట లక్ష్యసేన్‌కు శుభారంభం దక్కలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను అతను పోరాడి కోల్పోయాడు. అనంతరం లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ టోర్నీలో లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరుకోవడం ఇది రెండోసారి. 2022‌లో లక్ష్యసేన్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story