తెలుగమ్మాయి జ్యోతికి స్వర్ణం

by Harish |
తెలుగమ్మాయి జ్యోతికి స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరిగిన కుర్ప్‌ఫాల్జ్ గాలా వీన్‌హైమ్ అథ్లెటిక్స్ మీట్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజి సత్తాచాటింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. గతేడాది కూడా జ్యోతినే విజేతగా నిలిచింది. ఈ సారి కూడా సత్తాచాటి టైటిల్ నిలబెట్టుకుంది. 13.06 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ సాధించింది. జర్మనీ రన్నర్స్ కాథరినా వింక్లర్(13.61 సెకన్లు), లిసా మైహోఫర్(13.84 సెకన్లు) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, మహిళల 200 మీటర్ల రేసులోనూ పాల్గొన్న జ్యోతి కాంస్యం సాధించింది. 23.83 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల రేసులో మహహ్మద్ అఫ్సల్(1:47.05 సెకన్లు) బంగారు పతకం సాధించాడు. పురుషుల 200 మీటర్ల రేసులో అనిమేష్ కుజుర్(20.96 సెకన్లు), పురుషుల 110 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో తేజాస్ షిర్సే(13.60 సెకన్లు) రజతం గెలుచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed