- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Joe Root: సచిన్ రికార్డులపై జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్:ఇంగ్లండ్(England) స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) గత కొన్ని రోజులుగా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్(Test Cricket Format)లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అతను ఇప్పటివరకు 146 టెస్టుల్లో 12,402 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు ఉండగా, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.టెస్టుల్లో ఇంకో 70 పరుగులు చేస్తే ఇంగ్లండ్ తరుపున అత్యధికగా పరుగులు చేసిన ప్లేయర్ గా రూట్ రికార్డు సృష్టించనున్నాడు. అతనికన్న ముందు అలిస్టర్ కుక్(12,472) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు భారత క్రికెటర్(Indian cricketer) సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉంది. సచిన్ ఖాతాలో మొత్తం 15,921 పరుగులు ఉన్నాయి. సచిన్ రికార్డు ను చేరుకోవాలంటే రూట్ ఇంకా 3519 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రూట్ ఒక్కడే సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ రేపటి నుంచి మన పొరుగు దేశం పాకిస్తాన్(Pakistan) తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనుంది.ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూట్ మాట్లాడుతూ..'తానూ ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించలేదని, ఇంగ్లండ్ జట్టు విజయాల్లో తన రోల్ ఏంటనేది ముఖ్యమని వాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ ఇంకా ఎన్ని రోజులు ఆడతావని కొంతమంది ప్రశ్నించారు.నాకు ఫిట్ నెస్ ఉన్నంత వరకు టెస్ట్ క్రికెట్ ఆడుతానని, అప్పటి వరకు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి శ్రమిస్తా' అని తెలిపాడు.ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లతో తనకు మంచి సంబంధం ఉందని,మైదానంలోనే కాకుండా బయట కూడా వారితో సరదాగా ఉంటానని జో రూట్ వెల్లడించాడు.