- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jasprit Bumrah : టీమ్ ఇండియాకు భారీ షాక్.. గాయపడిన బుమ్రా
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. శనివారం తాత్కాలిక కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయపడ్డాడు. ఆట మధ్యలోనే మైదానం వీడాడు. ఆ తర్వాత అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. 10 ఓవర్లు వేసిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. అనూహ్యంగా రెండో సెషన్‌లో అతను మైదానం వీడాడు. దీంతో విరాట్ కోహ్లీ జట్టును నడిపించాడు. మెడికల్ సిబ్బంది బుమ్రాను స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. రెండో రోజు ఆట అనంతరం యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. బుమ్రా గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని వెల్లడించాడు. మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుందని, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే మరింత క్లారిటీ వస్తుందని తెలిపాడు. మరోవైపు, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, బౌలింగ్ చేస్తాడా?లేదా? అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఆదివారం అతని పరిస్థితిని బట్టి టీమ్ మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ బౌలింగ్ చేయలేకపోతే మాత్రం భారత జట్టుకు భారీ దెబ్బే అని చెప్పొచ్చు. భీకర ఫామ్‌లో ఉన్న బుమ్రా టీమిండియా బౌలింగ్ భారాన్ని ఒంటిచెత్తే మోస్తున్నాడు. ఆసిస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆసిస్ టూరులో 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, సిడ్నీ పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో బుమ్రా బౌలింగ్ చేయడం భారత్‌కు చాలా కీలకం.