సింధుకు మళ్లీ నిరాశే.. జపాన్ మాస్టర్స్‌లో రెండో రౌండ్‌లోనే ఔట్

by Harish |
సింధుకు మళ్లీ నిరాశే.. జపాన్ మాస్టర్స్‌లో రెండో రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ పీవీ సింధు టైటిల్ లేకుండానే మరో టోర్నీని ముగించింది. జపాన్ మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. టోర్నీలో తొలి రౌండ్ నెగ్గి శుభారంభం చేసిన సింధుకు రెండో రౌండ్‌లో నిరాశ తప్పలేదు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్లి లీ చేతిలో 21-17, 16-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది. గంటా 15 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు పోరాడి ఓడింది. మ్యాచ్‌లో మొదట గేమ్ సింధునే నెగ్గింది. మిగతా రెండు గేముల్లో సింధు గట్టిగానే పోరాడినప్పటికీ ప్రత్యర్థి కీలక సమయాల్లో పాయింట్లు సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సింధు బీడబ్ల్యూఎఫ్ టైటిల్ గెలిచి రెండేళ్లుకుపైగా అవుతుంది. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు, సింధు నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed