- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచీ పిచ్‌పై బెన్‌స్టోక్స్ కామెంట్స్‌కు బ్యాటింగ్ కోచ్ కౌంటర్
దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో మ్యాచ్ అనగానే పిచ్ గురించి ప్రశ్నలు లేవనెత్తడం సహజమేనని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. రాంచీ టెస్టుకు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విక్రమ్ రాథోడ్ పిచ్ గురించి మాట్లాడాడు. ‘ఇండియాలో ఆడుతున్న ప్రతిసారి పిచ్ గురించే ప్రశ్నలు వస్తాయి. ఇది ఇండియన్ టైపికల్ పిచ్. వికెట్‌పై క్రాక్స్ ఉంటే టర్న్ అవుతుంది. అయితే టర్న్ ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి లభిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం.’ అని తెలిపాడు. పిచ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విక్రమ్ రాథోడ్ ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. రాంచీ పిచ్ గురించి బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ..‘ఇలాంటి పిచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. పిచ్ గడ్డితో పచ్చగా కనిపిస్తుంది. కానీ, లోతుగా పరిశీలిస్తే భిన్నంగా ఉంది. చాలా డార్క్‌గా, పగుళ్లు కనిపిస్తున్నాయి.’ అని తెలిపాడు.
- Tags
- #ind vs eng