- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL : RCB టైటిల్ గెలవకపోవడానికి కారణమిదే..: స్టార్ క్రికెటర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుపై ప్రతి సీజన్‌లో భారీ అంచనాలు ఉండటం ఆ జట్టు మాత్రం టైటిల్ గెలవకపోవడం ప్రతీ సారి జరుగుతున్న తంతే. ఇదే విషయమై వెస్ట్ ఇండీస్ స్టార్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్‌లో అందరి దృష్టి తనతో పాటు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండేదని.. అందుకే మిగిలిన ప్లేయర్స్ జట్టులో భాగం కానట్లు ఆడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేకపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
జట్టులో కీలక ఆటగాడిగా ఉండడం ఎప్పుడూ సంతోషమేనని.. కానీ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు నాతో పాటు కోహ్లి, డివిలియర్స్‌పైనే అందరి దృష్టి ఉండేదని తెలిపాడు. దీనివల్ల మిగిలిన ఆటగాళ్లలో ఎక్కువ మంది తమకు ఈ జట్టుతో సంబంధం లేనట్లు ఉండేవాళ్లన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ జట్టుకైనా టైటిల్ గెలవడం పెద్ద సవాల్ అని గేల్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు గేల్, డివిలియర్స్ ధరించిన 333, 17 జెర్సీలను వారికి గౌరవంగా కేటాయిస్తూ రిటైర్ చేసినట్లు ఆర్సీబీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇద్దరు దిగ్గజాలను బెంగళూరు తమ హాల్ ఫేమ్‌లోకి చేర్చింది. 2021 సీజన్ తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో గత సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా కప్ మాత్రం గెలవలేకపోయింది.