IPL -2025 : ఐపీఎల్ కా బాద్ షా హెన్రిచ్ క్లాసెన్.. రిటెన్షన్ జాబితా విడుదల!

by saikumar |
IPL -2025 : ఐపీఎల్ కా బాద్ షా హెన్రిచ్ క్లాసెన్.. రిటెన్షన్ జాబితా విడుదల!
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 (IPL) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమతో అంటిపెట్టుకోనున్న కీలక ఆటగాళ్ల(Key Players) జాబితాను విడుదల చేశారు. దీంతో ఐపీఎల్ అభిమానుల(IPL Fans) ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నేడు (అక్టోబర్ 31) లోపు ఐపీఎల్‌లో పాల్గొనే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్టును అందించాలని బీసీసీఐ(BCCI) గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగావేలానికి ముందు మొత్తం 10 ఫ్రాంచైజీలు (Franchise Owners) తమ కీలక ఆటగాళ్ల జాబితాను ఫైనల్ చేశాయి. ఇక నవంబర్ రెండు లేదా మూడో వారంలో మెగావేలం జరగనుంది.

వేలంలో పాల్గొనున్న కీలక ప్లేయర్లు..

ఈసారి మెగావేలంలో కీలక ప్లేయర్లు పాల్గొననున్నారు. మొన్నటి వరకు పలు జట్లకు కెప్టెన్‌లు కొనసాగిన వారే అధికంగా వేలానికి వస్తున్నారు. వారిలో ఢిల్లీ జట్టు కెప్టెన్ పంత్(pant), లక్నో కెప్టెన్ రాహుల్(KL Rahul), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ (Duplisis), కేకేఆర్‌ కెప్టెన్ అయ్యర్(Shrays Ayyar), పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ వంటి వారు ఉన్నారు. వీరిని అంటిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీలు సుముఖత వ్యక్తం చేయలేదని టాక్. ఇక ముంబై నుంచి రోహిత్ శర్మ(Rohit sharma) మెగావేలానికి వస్తారని అంతా భావించగా.. ముంబై మాత్రం రోహిత్‌ను రిటైన్ చేసుకుంది. కాగా, గత సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై జట్టుకు మరోసారి హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహారిస్తారని మేనెజ్మెంట్ ప్రకటించింది. మరో సెన్సెషనల్ న్యూస్ ఎంటంటే ఈసారి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ(Kohli) కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక గత సీజన్‌లో కేకేఆర్‌కు ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా జట్టును రిటైన్ చేసుకోకపోవడం బాధాకరం. ఇదిలాఉండగా, మెగావేలంలో ఈ స్టార్ క్రికెటర్లను ఏ జట్లు సొంతం చేసుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

అత్యధిక రికార్డు ధరకు క్లాసెన్..

ఐపీఎల్-2025లో సౌతాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌ను రూ.23 కోట్ల అత్యధిక భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ.21 కోట్లు(సెకండ్ హయ్యెస్ట్), వెస్టిండిస్ ప్లేయర్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లకు లక్నో సూపర్ జెయంట్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇక చెన్నయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఏంటంటే.. మహేంద్రసింగ్ ధోనిని సీఎస్కే రూ.4 కోట్లు (అన్‌క్యాప్డ్) ప్లేయర్‌గా కొనుగోలు చేసింది.

ఫ్రాంచైజీలు రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు ఇవే..

01. ముంబయి ఇండియన్స్‌..

జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు)

రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)

సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)

హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)

తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

02. చెన్నై సూపర్ కింగ్స్‌..

రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)

మతిశ పతిరన (రూ.13 కోట్లు

శివమ్ దూబె (రూ.12 కోట్లు)

రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)

మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)

03. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు..

విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)

రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)

యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

04.సన్‌రైజర్స్‌ హైదరాబాద్..

హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)

పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)

అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)

నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)

ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

05.రాజస్థాన్ రాయల్స్‌..

సంజు శాంసన్ (రూ.18 కోట్లు)

యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)

రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)

ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)

హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు)

సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

06. ఢిల్లీ క్యాపిటల్స్‌..

అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)

కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)

ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)

అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

07. కోల్‌కతా నైట్‌రైడర్స్‌..

రింకూ సింగ్ (రూ.13 కోట్లు)

వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు)

సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)

ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)

హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)

రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

08. గుజరాత్‌ టైటాన్స్‌..

రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు)

శుభ్‌మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు)

సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు)

రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు)

షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

09. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌..

నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు)

రవి బిష్ణోయ్‌ (రూ.11 కోట్లు)

మయాంక్‌ యాదవ్ (రూ.11 కోట్లు)

మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

ఆయుష్‌ బదోనీ (రూ.4 కోట్లు)

10. పంజాబ్‌ కింగ్స్‌..

శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు)

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రూ.4 కోట్లు)

Advertisement

Next Story