IPL-2024 షెడ్యూల్ విడుదల.. ఆ జట్ల మధ్యే ఫస్ట్ మ్యాచ్

by GSrikanth |   ( Updated:2024-02-28 14:17:06.0  )
IPL-2024 షెడ్యూల్ విడుదల.. ఆ జట్ల మధ్యే ఫస్ట్ మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. గురువారం బీసీసీఐ అధ్యక్షుడు జైషా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 22వ తేదీన చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఎమ్ఎస్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఫస్ట్ మ్యాచ్‌లో తలపడనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేనట్లుగా మొదటి 21 మ్యాచులకే షెడ్యూల్ విడుదల చేయడం విశేషం. మార్చి 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య ఒక మ్యాచ్, పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య మరో మ్యాచ్ జరుగనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేవలం 21 మ్యాచులకే షెడ్యూల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్ కూడా విడుదల కానుంది.

Advertisement

Next Story