- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాండ్యాపై మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టుకు, దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌కు రెండు నెలల ముందు పాండ్యా గాయపడ్డాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాష్ట్రం తరపున ఆడలేదు. అతను నేరుగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. అలా జరగకూడదు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు. కానీ, దేశం, రాష్ట్రం తరపున ఆడాలి.’ అని పాండ్యాపై విమర్శలు చేశాడు.
అలాగే, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు ఇవ్వడంపై ప్రవీణ్ స్పందిస్తూ..‘ముంబైని విజయవంతంగా నడిపించే సత్తా రోహిత్‌కు ఉంది. ఈ ఏడాదే కాదు. మరో రెండు, మూడేళ్లు నడిపించగలడు. కానీ, నిర్ణయం మేనేజ్‌మెంట్ చేతుల్లో ఉంటుంది.’ అని తెలిపాడు. కాగా, వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చీలమండల గాయం బారిన పడిన పాండ్యా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అతను నేరుగా ఐపీఎల్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.