IPL 2023: అలాంటి వాటిని ప్రమోట్ చేయోద్దు.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్‌ విజ్ఞప్తి..

by Vinod kumar |
IPL 2023: అలాంటి వాటిని ప్రమోట్ చేయోద్దు.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్‌ విజ్ఞప్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్‌ లీగ్‌ ఈ సీజన్‌లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది. అయితే హెర్బల్‌ లైఫ్‌ లాంటి సంస్థలను ఐపీఎల్ తమ భాగస్వామిగా ప్రకటించడంపై బీసీసీఐ పునరాలోచన చేయాలని ఐపీఎల్ యాజమాన్యానికి వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, నాణేనికి మరోవైపు.. ఐపీఎల్‌ క్రేజ్‌ను బెట్టింగ్‌లు, ఇతర దందాలతో దుర్వినియోగం చేస్తున్నవాళ్లు కూడా కోకొల్లలు. తాజాగా.. గొలుసుకట్ట సంస్థ హెర్బల్‌ లైఫ్‌ కూడా ఈ జాబితాలో చేరిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. ఐపీఎల్‌ అఫిషియల్‌ పార్ట్‌నర్‌గా ఉన్నామంటూ తమ ప్రాడక్టులతో అమాయక ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. హెర్బల్‌ లైఫ్‌ లాంటి సంస్థలను తమ భాగస్వామిగా ప్రకటించడంపై బీసీసీఐ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘‘హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుక‌ట్టు సంస్థలు అమాయ‌క‌పు ప్రజ‌ల‌ను మోసం చేస్తూనే ఉన్నాయి. IPLకు అఫిషియ‌ల్ పార్టన‌ర్‌గా ఉన్నామంటూ ప్రొడ‌క్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోస‌పూరిత సంస్థల‌ను అఫిషియ‌ల్ పార్టన‌ర్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం పున‌రాలోచించాలి. హెర్బల్ లైఫ్పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చ‌ట్టప్రకారం చ‌ర్యలు తీసుకుని.. మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి’’ అని వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్‌-2023 నేపథ్యంలో హెర్బల్‌ లైఫ్‌ సంస్థ బీసీసీఐతో జట్టు కట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story