- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: అహ్మదాబాద్‌కు వర్ష సూచన.. చెన్నై vs గుజరాత్ మ్యాచ్ జరిగేనా?
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు నుంచి ఐపీఎల్ 16 వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. అయితే అట్టహాసంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేసుకుంటుంగానే వాతావరణ శాఖ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సైతం చేయలేదు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి అహ్మదాబాద్ లో వర్షం పడలేదు. పైగా ఎండ ఉంది. సాయంత్రానికి కల్లా పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా సాగే ఛాన్స్ ఉంటుంది.