నిర్మించి మూడు నెలలైన.. ప్రారంభానికి నోచుకోని బ్యాడ్మింటన్ కోర్టు

by Vinod kumar |
నిర్మించి మూడు నెలలైన.. ప్రారంభానికి నోచుకోని బ్యాడ్మింటన్ కోర్టు
X

తిరుచ్చి: క్రీడలు ఆరోగ్యానికి మంచిదని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటారు. కానీ సొంత డబ్బులతో నిర్మించుకున్న ఓ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. ఈ ఇండోర్ స్టేడియం నిర్మించి మూడు నెలలవుతోంది. వివరాల్లోకి వెళితే.. లాసన్స్‌ రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాలనీలో ‘నమక్కు నేమ్ తిట్టం’ కింద నిర్మించిన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు నిర్మాణం పూర్తయి మూడు నెలలు కావస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అందరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు క్రీడా సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఆఫీసర్స్ కాలనీ నివాసితుల బృందం ఒక సంవత్సరం క్రితం ప్రజల సహకారంతో బ్యాడ్మింటన్ కోర్టును నిర్మించాలని ఆలోచించింది.

తిరుచ్చి కార్పొరేషన్ సీనియర్ అధికారులను కలుసుకున్నారు. నమక్కు నేమ్ తిట్టం కింద రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. తర్వాత కార్పొరేషన్ ఉయ్యకొండన్ కెనాల్ ఒడ్డున స్థలాన్ని కేటాయించింది. బ్యాడ్మింటన్ కోర్టు కోసం దాని తరపున సుమారు రూ. 15 లక్షలు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్‌లో పౌరసరఫరాల సంస్థ కోర్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 2250 చదరపు

అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోర్టు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఆటగాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు నేలపై ఏడు పొరలు వేశారు. కోర్టులో ఉపయోగించే సింథటిక్ పదార్థాలు కొన్ని దిగుమతి చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్, వార్మప్ హాల్, టాయిలెట్లు, సెక్యూరిటీ ఎన్‌క్లోజర్ అన్ని ఏర్పాట్లూ చేశారు. గత డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. కానీ ప్రారంభోత్సవానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు.

Advertisement

Next Story