ఇండియన్ వెల్స్‌కు జొకోవిచ్ దూరం.. ఎందుకంటే..?

by Vinod kumar |
ఇండియన్ వెల్స్‌కు జొకోవిచ్ దూరం.. ఎందుకంటే..?
X

న్యూఢిల్లీ: ఇండియన్ వెల్స్‌లో జరుగుతున్న బిఎన్‌పి పిరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ప్రపంచ నెంబర్ వన్, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన నోవక్ జొకోవిచ్ దూరమయ్యాడు. యూఎస్‌కు వచ్చేందుకు జొకోవిచ్ కోరిన కోవిడ్-19 సర్టిఫికెట్ మినహాయింపును నిర్వాహకలు తిరస్కరించారు. వరల్డ్ నంబర్ వన్ నోవక్ జకోవిచ్ బిఎన్‌పి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి జొకోవిచ్ దూరమయ్యాడని, అతని స్థానంలో నికోలోజ్‌ను తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు.

కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోని తనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని తద్వారా ఈ వారంలో జరిగే ఇండియన్ వెల్స్‌లో పాల్గొంటానని యూఎస్ ప్రభుత్వాన్ని జొకోవిచ్ ఫిబ్రవరిలో కోరాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులను అమెరికా తమ దేశంలోకి అనుమతించడం లేదు. దీని కారణంగానే గతేడాది న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ పాల్గొనలేకపోయాడు. జొకోవిచ్‌ను అనుమతించకపోవడాన్ని ఇండియన్ వెల్స్ టోర్నీ డైరెక్టర్ టామీ హాస్ అవమానకరంగా అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed