కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్..

by Vinod kumar |   ( Updated:2023-02-22 14:18:21.0  )
కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్..
X

న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ వరల్డ్ చాంపియన్, నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. ప్రొ చెస్ లీగ్ ఆన్‌లైన్ టోర్నమెంట్‌లో కార్ట్‌సెన్‌ను విదిత్ ఓడించాడు. మంగళవారం రాత్రి ఇండియన్ యోగిస్, కెనడా చెస్ బ్రాస్ మధ్య జరిగిన 4వ రౌండ్‌ తొలి మ్యాచ్‌లో కార్ల్‌సెన్, విదిత్ పోటీపడ్డారు. నల్లపావులతో ఆడిన విదిత్ వరల్డ్ చాంపియన్‌కు ప్రారంభం నుంచి గట్టి పోటీనిచ్చాడు.

ఈ క్రమంలో కార్ల్‌సెన్‌ చేసిన పొరపాట్లను సద్వినియోగం చేసుకున్న విదిత్ వరల్డ్ చాంపియన్‌ను చిత్తు చేశాడు. దాంతో కార్ల్‌సెన్‌ను ఓడించిన ప్రజ్ఞానందా, గుకేశ్, అర్జున్ ఇరిగైసి సరసన విదిత్ చేరాడు. మిగతా మూడు మ్యాచ్‌ల్లో సాద్వాని రౌనక్, వైశాలీ రమేశ్‌బాబు, ఆరోనక్ ఘోష్ ప్రత్యర్థులను ఓడించడంతో 4వ రౌండ్‌ను ఇండియన్ యోగిస్ 4-0 తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం టీమ్ స్టాండింగ్స్‌లో ఇండియన్ యోగిస్ 4.0 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉన్నది.

Also Read..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్స్ అదరగొట్టారు..

Advertisement

Next Story