పతకాల పంట పండిస్తున్న భారత స్విమ్మర్లు.. మరో నాలుగు పతకాలు ఖాతాలో

by Harish |
పతకాల పంట పండిస్తున్న భారత స్విమ్మర్లు.. మరో నాలుగు పతకాలు ఖాతాలో
X

దిశ, స్పోర్ట్స్ : ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఏషియన్ ఏజ్ గ్రూపు స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్విమర్లు అదరగొడుతున్నారు. గురువారం మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేర్చారు. అందులో రెండు స్వర్ణ పతకాలు ఉన్నాయి. శ్రీహరి నటరాజ్, అనీశ్ గౌడ, సజన్ ప్రకాశ్, ఆర్యన్ నెహ్రాలతో కూడిన భారత జట్టు పురుషుల 4×200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్‌లో 7:26.64 సెకన్లలో లక్ష్యాన్ని స్వర్ణం సాధించింది. ఈ ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డును కూడా నమోదు చేసింది. గతేడాది ఆసియా క్రీడల్లో నమోదైన 7:29.4 సెకన్ల జాతీయ రికార్డును తాజాగా అధిగమించింది. మరోవైపు, శ్రీహరి నటరాజ్‌కు ఈ టోర్నీలో ఇది నాలుగో స్వర్ణ పతక కావడం విశేషం. అలాగే, బాలికల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో జోషి పాలక్ అశుతోష్ గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఆమె 2:21:55 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో నీతిక్ నాతెల్లా, రిషబ్ దాస్ రజతం, కాంస్యం సాధించాడు. నీతిక్ 2:03.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా.. రిషబ్ 2:05.73 సెకన్లలో పూర్తి చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో మెడల్స్ టేబుల్‌లో భారత్ 20 పతకాలతో 6వ స్థానంలో ఉన్నది. అందులో 5 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed