- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Jupally : నాగార్జునసాగర్‌ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుస్తాం
దిశ,నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు Minister Jupallyమంత్రి జూపల్లి. పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జునసాగర్ బుద్ధ వనాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కలిసి నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలోని వ్యూ పాయింట్ యోగా ధ్యాన కేంద్రాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు.
బౌద్ధం విలసిల్లిన ఈ నాగార్జునసాగర్ ప్రాంతంలో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో, వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల సౌకర్యార్థం త్వరలోనే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లో స్టార్ హోటల్ ను నిర్మించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంలో మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనం ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బుద్ధవనం ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని, యావత్ ప్రపంచానికి బౌద్ధ వారసత్వ, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బౌద్ధ టూరిజం ( Tourism ) సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనం ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని కొనియాడారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి తెలిపారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని ప్రజలు తప్పక సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.