Dreams : రాత్రిళ్లు కలలు వస్తాయి కానీ గుర్తుండవు..! కారణం ఇదే..

by Javid Pasha |
Dreams : రాత్రిళ్లు కలలు వస్తాయి కానీ గుర్తుండవు..! కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట నిద్రపోయిప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికీ ఏదో ఏదో సందర్భంలో ఏదో ఒక కలవచ్చి ఉంటుంది. కొన్నిసార్లు భయకంరమైన కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందం కలిగించే కలలు వస్తుంటాయి. అయితే చాలా మందికి తెల్లారేసరికి అవి గుర్తుండవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం కలలను ఎందుకు మర్చిపోతాం? అనేది తెలుసుకునే తాజాగా యునైటెడ్ స్టేట్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు పలు కోణాల్లో అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో చూద్దాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మనసులో నాటుకు పోయిన బలమైన భావాలను బట్టి, ఎదుర్కొన్న సంఘలను బట్టి, వారి ప్రవర్తననుబట్టి కూడా కలలు వస్తాయి. కొన్నిసార్లు మనలో ఉత్సాహం నింపే కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందానికి కారణం అయ్యే కలలు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు భయానకమైనవి, ఆందోళన కలిగించేవి వస్తుంటాయి. అయితే వీటిలో గుర్తుండేవి మాత్రం చాలా తక్కువ. వాస్తవానికి రాత్రిళ్లు వచ్చే కలల్లో 99 శాతం వరకు మనకు గుర్తుండవని పరిశోధకులు అంటున్నారు. అందకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.

రాత్రిళ్లు నిద్రపోయినప్పుడు మెదడులో జరిగే కొన్ని రసాయనిక మార్పులు కలలు రావడానికి, వచ్చినా గుర్తుండకపోవడానికి దారితీస్తాయి. ముఖ్యంగా కంటి కదలిక సమయంలో(Rapid eye movement), నోర్పెనెఫ్రైన్(norepinephrine), సెరోటోనిన్, ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు మెదడును ప్రభావితం చేస్తాయి. అవి కలలు వచ్చే సందర్భంలో క్రియారహితం చేయబడతాయని, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడాన్ని కష్టతరం చేస్తాయని నిపుణులు పేర్కొంటటున్నారు. దీనివల్ల కలలు గుర్తుండవు. అలాగే డ్రీమ్స్ స్వల్పకాలిక మెమోరీలో నిల్వచేయబడే ‘మెమోరీ కన్సాలిడేషన్’ కూడా పరిమిత సామర్థ్యాన్ని, వ్యవధిని కలిగి ఉంటుంది. దీనివల్ల కూడా కలలు గుర్తుండవు.

Advertisement

Next Story

Most Viewed