Andhra Pradesh:‘రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయకపోతే ఉద్యమిస్తాం’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Andhra Pradesh:‘రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయకపోతే ఉద్యమిస్తాం’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమరజీవి పొట్టి శ్రీరాములు, పట్టాభి సీతారామయ్య లాంటి మహామహుల పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(నవంబర్ 1) ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం(Andhra State Incarnation Day) సందర్భంగా వైసీపీ నేత(YCP Leader) మల్లాది విష్ణు స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోవడాన్ని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆక్షేపించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కించపరిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు. అవతరణ దినోత్సవం చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అటు రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం జగన్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుందాం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed