బంగ్లాతో టెస్ట్ సిరీస్.. తొలి టెస్ట్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

by Javid Pasha |   ( Updated:2022-12-14 05:31:18.0  )
బంగ్లాతో టెస్ట్ సిరీస్.. తొలి టెస్ట్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
X

దిశ, వెబ్ డెస్క్: రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో భాగంగా బంగ్లాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బంగ్లాతో వన్డే సిరీస్ ను చేజార్చుకున్న ఇండియా.. ఎలాగైనా ఈ సిరీస్ లో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. అయితే సీనియర్లకు గాయాలు టీమిండియాను కలవరపెడుతోంది. వేలికి గాయం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అలాగే వెన్నునొప్పితో పేస్ బౌలర్ బుమ్రా, భుజం గాయంతో షమీ, మోకాలి నొప్పితో జడేజా ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. దీనికి తోడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌కు క్వాలిఫికేషన్‌‌ నేపథ్యంలో టీమిండియాకు ఈ సిరీస్‌‌ కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఇండియా నాలుగో ప్లేస్‌‌లో ఉంది. జూన్‌‌లో జరిగే ఫైనల్స్‌‌కు అర్హత సాధించాలంటే ఈ రెండు టెస్ట్‌‌లు నెగ్గడంతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇక తొలి టెస్ట్ లో టీమిండియాకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు.

టీమిండియా: రాహుల్ (కెప్టెన్), పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, పంత్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, సిరాజ్

Read More...

స్మృతి మంధాన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్

Advertisement

Next Story