టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టుతో జూన్‌లో జరగాల్సిన వన్డే సిరీస్‌ వాయిదా!

by Vinod kumar |
టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టుతో జూన్‌లో జరగాల్సిన వన్డే సిరీస్‌ వాయిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది జూన్‌లో భారత్‌, ఆఫ్గానిస్తాన్‌ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ వాయిదా వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని భారత క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌, సిరీస్‌కు బ్రాడ్‌కాస్టర్ లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ ఉండడంతో.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం భారత జట్టు విండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా రోహిత్‌ సేన రెండు టెస్టు, 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Advertisement

Next Story