ఆస్ట్రేలియా టూరులో టీమిండియాకు వార్మప్ మ్యాచ్

by Harish |
ఆస్ట్రేలియా టూరులో టీమిండియాకు వార్మప్ మ్యాచ్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్, ఆసిస్ జట్లు ఐదు టెస్టులు ఆడబోతున్నాయి. ఈ టూరులో రోహిత్ సేన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం వెల్లడించింది. తొలి టెస్టు, రెండో టెస్టు మధ్యలో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రైమ్ మినిష్టర్ ప్లేయింగ్ 11తో భారత జట్టు ఆడుతుందని పేర్కొంది.

నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో కాన్‌బెర్రా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరిగే రెండో టెస్టును డే నైట్‌గా నిర్వహించనున్నారు. ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు సన్నద్ధమయ్యేందుకు రెండు రోజుల డే నైట్ మ్యాచ్‌ ఉపయోగపడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాగా, నవంబర్ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు సిరీస్ జరగనుంది. 1991-92 సీజన్ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే, ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో గత నాలుగు సీజన్లుగా టీమిండియానే విజేతగా నిలుస్తూ వస్తోంది. గతేడాది భారత్ వేదికగా జరగగా రోహిత్ సేన 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed