- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Shoaib Akhtar: కచ్చితంగా అక్తర్ రికార్డు బ్రేక్ చేస్తా:టీమిండియా బౌలర్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డును కచ్చితంగా బ్రేక్ చేస్తానని అన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్‌లో తన చూరుకైన బౌలింగ్ ప్రదర్శనతో అందరిని మెప్పించి.. టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ వేసి రికార్డులను సొంతం చేసుకున్నాడు. కాగా, 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై అక్తర్ తన వేగవంతమైన బంతిని 161.3 కి.మీ వేగంతో వేశాడని, ఆ రికార్డును బ్రేక్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ రికార్డు బ్రేక్ చేస్తే భారత్‌కు మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని అన్నాడు. అంతేకాక వేగంగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టడమే కాకుండా.. జట్టు కోసం వికెట్లు తీయడానికి మంచి నైపుణ్యంతో బౌలింగ్ చేస్తానని అన్నాడు.