- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీలో 2వ ర్యాంక్‌కు టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా 2వ ర్యాంక్‌కు దూసుకొచ్చింది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారీ విజయంతో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ సేన 6వ స్థానంలో ఉండగా.. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 52.77 శాతంతో రెండో ర్యాంక్‌లో ఉన్నది. డబ్ల్యూటీసీ 2023-25 సర్కిల్‌లో ఇప్పటి వరకు భారత్ 6 మ్యాచ్‌లు ఆడగా మూడింట విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. రెండింట ఓడింది.
కాగా, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ రెండో స్థానంలో ఉండేది. అయితే, తొలి టెస్టులో ఓటమితో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి 5వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆ తర్వాత 6వ స్థానానికి దిగజారింది. కానీ, రెండో టెస్టులో భారీ విజయంతో టీమ్ ఇండియా ఏకంగా నాలుగు స్థానాలు అధిగమించి తిరిగి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా 55 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ 8వ స్థానంలో ఉన్నది. మిగతా సిరీస్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే టాప్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.