అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. వారికి నో ఛాన్స్..! మ్యాంగో వార్ మిస్ అవుతామంటున్న ఫ్యాన్స్

by Vinod kumar |
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. వారికి నో ఛాన్స్..! మ్యాంగో వార్ మిస్ అవుతామంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ నిర్వహణపై సందేహాలు రేకెత్తగా.. బీసీసీఐ మాత్రం ఈ సిరీస్ నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ద్వితీయ శ్రేణి జట్టుతో ఈ సిరీస్‌ను ముగించాలని ప్రణాళికలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడిన ఆటగాళ్లంతా అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెంచరీల మోత మోగించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ఆకాశ్ మధ్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జితేశ్ శర్మ వంటి యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. IPL 2023 ముగిసిన వెంటనే ఈ సిరీస్‌పై బీసీసీఐ క్లారిటీ ఇవ్వనుంది. ఈ సిరీస్‌ జూన్‌ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇక అఫ్గానిస్థాన్ సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉండనున్నాడనే వార్తలతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నవీన్ ఉల్ హక్‌తో ఉన్న గొడవ నేపథ్యంలో మ్యాంగో వార్ మిస్సయ్యామని కామెంట్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడే భారత ద్వితీయ శ్రేణి జట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, జితేశ్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ మధ్వాల్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, మోహ్‌సిన్ ఖాన్, విజయ్ శంకర్

Advertisement

Next Story