ICC Rankings: వన్డే ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన గిల్, కిషన్‌..

by Vinod kumar |
ICC Rankings: వన్డే ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన గిల్, కిషన్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో భారత బ్యాటర్లు శబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ మూడో స్ధానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు నాలుగో ర్యాంక్‌లో ఉన్న గిల్‌.. ఆసియాకప్‌-2023లో భాగంగా నేపాల్‌పై అద్భుతంగా రాణించడంతో తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ 62 బంతుల్లో 67 పరుగులు చేసి ఆజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

మరోవైపు పాకిస్తాన్‌తో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ 12 స్ధానాలు ఎగబాకి 24వ స్ధానానికి చేరుకున్నాడు. కిషన్‌ పాకిస్తాన్‌పై 82 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక​టాప్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(882 పాయింట్లు) ఉండగా.. రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్‌ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed