- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: తొలి ఇన్సింగ్స్‌లో భారత్ ఆలౌట్.. చివర్లో ఆదుకున్న అక్షర్ పటేల్
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయ్యింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 74, విరాట్ కోహ్లీ 44, కెప్టెన్ రోహిత్ శర్మ 32, అశ్విన్ 37 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలంకావడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది.
ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ 5 వికెట్లతో భారత బ్యాటింగ్‌ను దెబ్బకొట్టగా.. యంగ్ బౌలర్స్ మర్ఫీ, కున్‌మెన్ చెరో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ కమిన్స్ ఓ వికెట్ సాధించాడు. ఇక రెండవ టెస్ట్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 262 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు అధిక్యం లభించింది.