IND vs NZ, 2nd Test: కెప్టెన్ రోహిత్ డకౌట్.. ముగిసిన మొదటి రోజు ఆట

by Mahesh |
IND vs NZ, 2nd Test: కెప్టెన్ రోహిత్ డకౌట్.. ముగిసిన మొదటి రోజు ఆట
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(India), న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఈ సిరీస్ కీలకం కానుంది. దీంతో ఇతర జట్ల దృష్టి ప్రస్తుతం ఈ సిరీస్ పైనే ఉంది. ఈ క్రమంలో మొదటి టెస్టులో న్యూజిలాండ్(New Zealand) జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం రెండో టెస్ట్(2nd Test) మ్యాచ్ పూణే వేదికగా ఈ రోజు(గురువారం) ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత ఫీల్డీంగ్ చేసింది. మొదటి రెండు సెషన్‌లో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోరు దిశగా ముందుకు సాగారు. కానీ భారత స్పిన్నర్లు అశ్విన్(Ashwin), సుందర్ (Sundar)లు తమ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సుందర్ కీలక బ్యాటర్లు అవుట్ చేయడమే కాకుండా మొదటి ఇన్నింగ్స్ (First innings)లో ఏకంగా 7 వికెట్లను తీసుకొని న్యూజిలాండ్ ఆలౌట్ లో కీలక పాత్ర పోషించాడు. అలాగే అశ్విన్ మూడు వికెట్లను పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్(New Zealand) జట్టు 79.1 ఓవర్లకు 259 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లు కాన్వే 76, రచిన్ రవీంద్ర 65, శాంట్నర్ 33, విల్ యంగ్ 18, లాథమ్ 15, డారీ మిచెల్ 18 పరుగులు చేశారు. అనంతరం భారత్ బ్యాటింగ్ కి రాగా.. మొదట్లోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 బంతులను ఎదుర్కొని ఎటువంటి స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యాడు. మొదటి రోజు చివర్లో భారత్ 11 ఓవర్లు ఆడి 1 వికెట్ కోల్పోయి 16 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 243 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాటర్లు జైస్వాల్ 6*, గిల్ 10* పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed