- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND Vs ENG: నిలకడగా ఆడుతోన్న టీమిండియా.. 14 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరుగుతోన్న చివరి వన్డేలో ఇంగ్లాండ్ (England) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా (Team India)కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (1) మార్క్ వుడ్ (Mark Wood) వేసిన అద్భుతమైన బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) మరో 13 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచేవాడు. కానీ, అతడు కేవలం 2 బంతును ఎదుర్కొని 1 పరుగు చేసి మరోసారి టీమిండియా (Team India) ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
అదేవిధంగా వన్డేల్లో మరో 3 క్యాచులు పడితే భారత జట్టు తరఫున ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 154 క్యాచులు ఉండగా.. ఇదే జాబితాలో అజారుద్దీన్ (Azharuddin) 156 క్యాచులతో ముందున్నాడు. అనంతరం క్రీజ్‌లో మరో ఓపెనర్ ఉన్న శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ధాటిగా ఆడుతున్నాడు. అతడు మొత్తం 47 బంతుల్లో 44 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇక మరో ఎండ్‌లో ఫామ్‌లో లేక సతమతం అవుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అనవసర షాట్లకు వెళ్లకుండా.. గ్యాప్‌లో షాట్లు ఆడతూ మెల్లిగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ 38 బంతుల్లో 38 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా (Team India) ఒక వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.