ఒక్కసారిగా మ్యాచును మలుపుతిప్పిన కుల్దీప్ యాదవ్.. ఆలౌట్ దిశగా ఇంగ్లాండ్

by Mahesh |
ఒక్కసారిగా మ్యాచును మలుపుతిప్పిన కుల్దీప్ యాదవ్.. ఆలౌట్ దిశగా ఇంగ్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో లంచ్ సమయం వరకు నిలకడగా రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత బౌలర్లను చెమటలు కక్కించారు. దీంతో భారత బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ జట్టు ఒకానొక సమయంలో 137 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కానీ 170 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా మ్యాచును తిప్పేశాడు. ఓపెనర్లు ముగ్గురుని అవుట్ చేశాడు. అలాగే కెప్టెన్ బెన్ స్టోక్స్ ను డకౌట్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 55 ఓవర్లకు 194 పరుగులు చేసి 8 వికెట్లతో ఆలౌట్ కు చేరువలో ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 2, జడేజా 1 వికెట్లతో పూర్తిగా స్పిన్నర్ల డామినేషన్ చూపించారు.

Advertisement

Next Story