IND Vs AUS : సూర్య కుమార్ స్టన్నింగ్ రనౌట్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-26 14:33:35.0  )
IND Vs AUS : సూర్య కుమార్ స్టన్నింగ్ రనౌట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ధనాధన్ బ్యాటింగ్, విభిన్నమైన షార్ట్‌లతో సూర్య కుమార్ యాదవ్ అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాచూర్యం పొందిన విషయం తెలిసిందే. మిస్టర్ 360గా పేరు గాంచిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మెరుపు రనౌట్ క్రికెట్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలుపులో సైతం సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీతో రాణించి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించారు. అయితే ఆసీస్ బ్యాట్స్‌మెన్ కామెరూన్ గ్రీన్‌ను మెరుపు వేగంతో రనౌట్ చేసి కీలక సమయంలో ఆసీస్ జట్టును దెబ్బదీశాడు. కొంచెం కుదురుకుంటే గ్రీన్ మైదానంలో విధ్వంసం సృష్టించడం అలవాటుగా మార్చుకున్నాడు. అయితే షమీ వేసిన బాల్‌ను ఆడిన గ్రీన్ మిస్ చేశాడు. అయితే బంతి కేఎల్ రాహుల్ ప్యాడ్స్‌ను తాకి వెనకకు వెళ్తుండగా గ్రీన్ రెండో పరుగుకోసం యత్నించాడు. అటు నుంచి ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్ల వెనకకు వేగంగా వచ్చిన సూర్య అందుకుని గ్రీన్‌ను డైవ్ చేసి మరి రనౌట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed