IND Vs AUS : అడిలైడ్ టెస్ట్‌కు వర్షం ముప్పు! క్యూరేటర్ ఏమన్నాడంటే..?

by Sathputhe Rajesh |
IND Vs AUS : అడిలైడ్ టెస్ట్‌కు వర్షం ముప్పు! క్యూరేటర్ ఏమన్నాడంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే రెండో టెస్ట్ శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఆట ప్రారంభం రోజు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అడిలైడ్‌ ఓవల్స్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘వర్షం ఏ సమయంలో పడుతుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే పిచ్‌ వద్ద కవర్లు సిద్ధంగా ఉంచాం. శనివారం ఉదయం కల్లా పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నాం. తద్వారా టెస్ట్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. పింక్ బాల్‌‌పై పిచ్‌ ప్రభాతం ఉండదు. సరైన వాతావరణ పరిస్థితుల్లో బంతి చురుకుగా కదులుతుంది’ అని అన్నాడు. పిచ్ ప్రిపరేషన్‌పై కొంత ఆందోళన ఉంది. ఈ పిచ్‌పై ఆటగాళ్లు ఎదుర్కొనే సవాళ్ల గురించి తాను మాట్లాడదలుచుకోలేదు. కొత్త బంతితో రాత్రి సమయంలో ఆడే సెషన్లు ఖచ్చితంగా ఉత్సాహాన్ని నింపుతాయి. చివరి సెషన్‌లో రెండు జట్లు డెక్లరేషన్ వైపు మొగ్గు చూపి ప్రత్యర్థులను త్వరగా ఆలౌట్ చేసేందుకు యత్నిస్తాయి. పిచ్ ప్రిపేర్ చేయడంలో తన పాత్రపై ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నాను. ఆటలో మిగతా అంశాలను అర్థం చేసుకోవాలనుకోవడం లేదు. మేము పిచ్‌ను సమర్థంగా తయారు చేయగలిగితే ఆటగాళ్లు మరింత ఉన్నతంగా రాణిస్తారు’ అని ఆయన అన్నాడు.

Advertisement

Next Story