IND vs AUS 3rd Test: మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌కు షాక్..

by Mahesh |
IND vs AUS 3rd Test: మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌కు షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో కేఎల్ రాహుల్ షాక్ తగిలింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించారు. అతని స్థానంలో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ని తీసుకున్నారు. అలాగే ఫెసర్ మహ్మద్ షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను తీసుకున్నారు.

కాగా ఈ టెస్ట్‌కు ముందు రాహుల్ ఫామ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికి రవి శాస్త్రి, రోహిత్ శర్మలు రాహుల్‌ను వెనకేసుకొచ్చారు. అలాగే రాహుల్ కు ఎన్ని అవకాశాలు అయినా ఇస్తామని రోహిత్ శర్మనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ క్రమంలో ఇవాళ రాహుల్‌ను మూడో టెస్టుకు ఎంచుకొకపోవడంతో రాహుల్ అభిమానులు షాకు‌కు గురయ్యారు.

Advertisement

Next Story