ముగిసిన తొలి రోజు ఆట.. ఆధిక్యంలో ఆసీస్..

by Vinod kumar |
ముగిసిన తొలి రోజు ఆట.. ఆధిక్యంలో ఆసీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌దే పైచేయి సాధించింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్న్‌లో 4 వికెట్లు కోల్పోయి 156 రన్స్‌తో 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. పీటర్‌ హ్యాండ్సకంబ్‌ (7), గ్రీన్‌ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఖవాజా (60), లంబుషేన్‌ 31, స్మిత్‌ 26, హెడ్‌ 9 పరుగులకు జడేజా బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ తొలి ఇన్నింగ్‌లో 109 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్‌, లైయన్‌ దెబ్బకు 33.2 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయింది. టీమిండియా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశ పరిచింది. గిల్‌ 21, కోహ్లీ 22, భరత్‌ 17, ఉమేష్‌ 17, అక్షర్‌ 12, రోహిత్‌ 12, మాత్రమే రెండు అంకెల స్కోరు చేయగలిగారు. ఆశ్విన్‌ 3, జడేజా 4, పుజార 1 అయ్యార్‌ 0, సిరాజ్‌ 0 సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కునెమన్‌ 5, లైయన్‌ 3, టాడ్‌ మర్ఫీకి ఒక వికెట్‌ దక్కింది.

Advertisement

Next Story

Most Viewed