ICC Women's T20 World Cup: ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. కివీస్ తో తొలి మ్యాచులో భారత్ బౌలింగ్

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-04 14:40:29.0  )
ICC Womens T20 World Cup: ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. కివీస్ తో తొలి మ్యాచులో భారత్ బౌలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్:ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌(ICC Women's T20 World Cup) టోర్నీ నిన్న యూఏఈ(UAE)లో ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా ఈ టోర్నీ ముందుగా బంగ్లాదేశ్(BAN) లో జరగాల్సి ఉండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐసీసీ ఈ టోర్నమెంట్‌ను UAEకి మార్చింది.ఇక ఈ సారి మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నీలో మొత్తం 10 దేశాలు పాల్గొంటున్నాయి.10 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్‌-ఎ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా తో పాటు,పాకిస్థాన్‌,శ్రీలంక,న్యూజిలాండ్‌,టీమిండియా జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బి లో బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,ఇంగ్లండ్,వెస్టిండీస్,స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.ఇదిలా ఉండగా.. టీమిండియా ఈ రోజు గ్రూప్ స్టేజి మొద‌టి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (Newzealand)తో త‌ల‌ప‌డుతోంది.ఈ మ్యాచులో కివీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది.ఈ మ్యాచులో భారత్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌, ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్,షెఫాలీ వర్మ, రిచా ఘోష్ లతో భారత బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది.కాగా ఇరు జట్లు ఇప్పటివరకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాలుగు సార్లు తలపడగా చెరో రెండు విజ‌యాల‌తో సమానంగా నిలిచాయి.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

భారత జట్టు:స్మృతీ మంధాన,షఫాలీ వర్మ,హర్మన్‌ప్రీత్‌(C),జెమీమా రోడ్రిగ్స్,రిచా ఘోష్(WK),దీప్తిశర్మ,వస్త్రాకర్‌,అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్,రేణుకాసింగ్‌,ఆశ శోభన.

న్యూజిలాండ్ జట్టు:సోఫీ డివైన్‌(C),సుజీ బేట్స్‌,జార్జియా ప్లిమెర్‌,అమీలియా కెర్‌,బ్రూక్‌ హాలీడే,మ్యాడీ గ్రీన్‌,ఇసబెల్లా గేజ్‌(WK),జెస్ కెర్‌,రోస్‌ మైర్,లియా తహుహు,కార్సన్‌.

Advertisement

Next Story

Most Viewed