ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానంలోకి జస్ప్రీత్ బుమ్రా

by Maddikunta Saikiran |
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానంలోకి జస్ప్రీత్ బుమ్రా
X

దిశ, వెబ్‌డెస్క్:ఐసీసీ(ICC) ఈ రోజు విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్(Test Rankings)లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు.టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి టెస్టుల్లో మొదటి స్థానానికి చేరుకున్నారు.కాగా..బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 870 రేటింగ్ పాయింట్స్ ఉండగా..అశ్విన్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ మూడో స్థానంలో,పాట్ కమిన్స్,రబాడ వరుసగా నాలుగు,ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.అయితే బౌలింగ్ విభాగంలో మొదటి ఆరు స్థానాల్లో ముగ్గురు మన టీమిండియా బౌలర్లే ఉండటం విశేషం.

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే..రెండో టెస్టులో హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal) తాజా ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.ప్రస్తుతం అతడు రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 12వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు.వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) మూడు స్థానాలు కోల్పోయి 9వ స్థానంలో ఉండగా..రోహిత్ శర్మ(Rohit Sharma)15..శుభమాన్ గిల్(Subhaman Gill) 16వ స్థానంలో నిలిచారు.ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టాప్ లో ఉండగా,కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.

Next Story

Most Viewed

    null