ఐపీఎల్‌లో కెప్టెన్సీ సీక్రెట్‌ను బయటపెట్టిన ధోనీ

by Harish |
ఐపీఎల్‌లో కెప్టెన్సీ సీక్రెట్‌ను బయటపెట్టిన ధోనీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ద్వారానే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకునే అవకాశం లభించిందని చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తెలిపాడు. ధోనీ మాట్లాడిన ఓ వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియాలో ధోనీ 2008 నాటి సీఎస్కే జట్టు గురించి మాట్లాడాడు. ‘2008లో చెన్నయ్ జట్టు సమతూకంగా ఉండేది. చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. మాథ్యూ హెడెన్‌, మైక్‌ హస్సీ, ముత్తయ్య మురళీధరన్‌, జాకోబ్‌ ఓరమ్‌ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. అప్పట్లో వారందరినీ ఒకే డ్రెస్సింగ్ రూంలో ఉంచడం, ఒకరునొకరు తెలుసుకోవడం పెద్ద సవాల్‌గా ఉండేది.’ అని మొదటి సీజన్ సంగతులను గుర్తు చేసుకున్నాడు.

కెప్టెన్‌గా ప్రతి ఆటగాడిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని తాను ఎప్పుడు నమ్ముతానని చెప్పాడు. ప్లేయర్ గురించి తెలిస్తేనే అతనిలోని బలాలు, బలహీనతలు బయటపడతాయని, అప్పుడు జట్టును సరైన దిశలో నడిపించడం సులభమవుతుందని తెలిపాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతోనే నేను ఎక్కువగా మాట్లాడను. ఐపీఎల్ వల్ల విదేశీ ప్లేయర్లను అర్థం చేసుకునే అవకాశం దక్కింది. క్రికెట్ గురించి వారు ఏం మాట్లాడుకుంటున్నారో, వారి సంస్కృతి ఏంటో తెలుసుకోవచ్చు. వీటివల్ల ఐపీఎల్‌ను మరింత ప్రత్యేకంగా మారింది.’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా, ధోనీ సారథ్యంలో సీఎస్కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌లో బరిలోకి దిగుతున్న చెన్నయ్ ఈనెల 22న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed