పరుగులు చేయకపోయినా.. నా పద్ధతి మార్చుకోను : Prithvi Shaw

by Vinod kumar |   ( Updated:2023-07-09 10:29:33.0  )
పరుగులు చేయకపోయినా.. నా పద్ధతి మార్చుకోను : Prithvi Shaw
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో చాలా ఘోరంగా విఫలమవుతున్న బ్యాటర్లలో పృథ్వీ షా ఒకడు. ఐపీఎల్‌తో దారుణంగా విఫలమైన అతను.. దులీప్ ట్రోఫీలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే పుజారా, సూర్యకుమార్ రాణించడంతో అతని టీం దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరింది. ఈ సందర్భంగా పృథ్వీ షా మాట్లాడుతూ.. తన ఆటతీరు మార్చుకోవాలని అనుకోవడం లేదని తేల్చిచెప్పాడు. 'నా ఆట ఎందుకు మార్చుకోవాలో నాకు తెలియడం లేదు. అయితే ఇంకొచెం తెలివిగా అయితే ఆడగలను.

నేను పుజారాలా బ్యాటింగ్ చేయలేను. పుజారా నాలా బ్యాటింగ్ చేయలేడు కదా' అని పృథ్వీ షా అన్నాడు. 'నేను ఇక్కడి వరకు రావడానికి ఉపయోగపడిన ఆటనే నేను ఆడేందుకు ట్రై చేస్తున్నా. ఎగ్రెసివ్ బ్యాటింగ్ నా కెరీర్‌కు బాగా యూజ్ అయింది. దాన్ని మార్చుకోవాలని అనుకోవట్లేదు' అని చెప్పాడు. అలాగే తనకు ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే అన్నాడు. దులీప్ ట్రోఫీ అయినా, ముంబై తరఫున ఆడినా ఏ మ్యాచ్ అయినా తనకు ముఖ్యమే అని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed