- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
8 ఏళ్ల నిరీక్షణకు తెర.. త్వరలోనే హాకీ ఇండియా లీగ్
దిశ,స్పోర్ట్స్ : ప్రతిష్ఠ్మాతక హాకీ ఇండియా లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే హాకీ ఇండియా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆరంభించింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న జట్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హకీ ఇండియా మేనేజ్మెంట్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం ప్రత్యేక అప్లికేషన్ ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్లికేషన్ స్వీకరణకు జూన్ 30వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. భారత్‌లో 2017లో చివరిసారిగా హకీ ఇండియా లీగ్ జరిగింది. 2023లో టోర్నీ నిర్వహించాలని భావించినా అది వర్కౌట్ కాలేదు. అందుకే ఆ టోర్నీని ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో నిర్వహించేందుకు హకీ ఇండియా సన్నాహాలు చేస్తుంది.
ఈ టోర్నీలో మెన్స్ విభాగంలో మొత్తం 8 జట్లు, మహిళల విభాగంలో మొత్తం 6 జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించారు.‘ ఇదొక గొప్ప ముందడుగు. హాకీ ఇండియా లీగ్ పున:ప్రారంభానికి మరింత చేరువయ్యాం. ఈ టోర్నీని హాకీ ఆటగాళ్లు,ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడతారు. భారత ఆటగాళ్లకు ప్రపంచంలోని హాకీ స్టార్లతో పోటీ పడేందుకు ఇదొక చక్కటి అవకాశం’ అని హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టర్కీ వెల్లడించారు.