Harbhajan Singh : పదేళ్లుగా ధోనీతో మాటల్లేవు.. : ‌హర్భజన్ సింగ్

by Sathputhe Rajesh |
Harbhajan Singh : పదేళ్లుగా ధోనీతో మాటల్లేవు.. : ‌హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : పదేళ్లుగా భారత మాజీ కెప్టెన్ ధోనీతో మాటల్లేవని హర్భజన్ సింగ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల వీరిద్దరి మధ్య సత్సంబంధాలు సరిగా లేవని ప్రచారం జరుగుతుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై హర్భజన్ క్లారిటీ ఇచ్చాడు. 2007, 2011లో భారత్ టీ20, వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమ్ మేట్స్‌గా ఉన్నారు. 2018-20 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మైదానంలో ఆడినప్పుడు సైతం పరిమితంగా మాట్లాడుకున్నట్లు హర్భజన్ తెలిపాడు. ‘నేను ధోనీతో మాట్లాడటం లేదు. ఐపీఎల్‌లో చెన్నైతో ఆడినప్పుడు పరిమితంగానే మాట్లాడాను. నేను ధోనీ రూమ్‌కి వెళ్లేవాడిని కాదు. తాను నా రూమ్‌కి వచ్చేవాడు కాదు. ధోనీతో మాట్లాడకపోవడటానికి కారణం ఏమీ లేదు. కానీ పదేళ్లుగా మాట్లాడటం లేదు. నాకు ధోనీతో ఎలాంటి ఇబ్బంది లేదు. తను ఏదైనా చెప్పాలనుకుంటే కాల్ చేయొచ్చు. నా కాల్స్‌కు రిప్లై ఇచ్చే వారికి మాత్రమే నేను ఫోన్ చేస్తాను. నాతో స్నేహంగా మెదిలే వారితోనే టచ్‌లో ఉంటాను. నేను ఫోన్ చేసినప్పుడు రెండు మూడు సార్లు రెస్పాండ్ అవకపోతే వారికి అవసరం ఉంటేనే కలుస్తాను..’ అని హర్భజన్ అన్నాడు.

Advertisement

Next Story