- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ప్రపంచ కప్ సెమీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఔట్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌కి ముందే భారత్ ఉమెన్స్ టీమ్‌కి వరుస ఎదురుదెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ గాయంతో తప్పుకోగా.. స్పిన్నర్ రాధ యాదవ్ కూడా ఫిట్‌గా లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యంతో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6:30 గంటలకి భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ -1 మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాపై భారత్ జట్టుకి టీ20 వరల్డ్‌కప్‌లో ఏమంత మెరుగైన రికార్డ్ లేదు. ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఐదు సార్లు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా.. భారత్ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
సెమీ ఫైనల్ ముంగిట భారత్ జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా తప్పుకుంది. ఈ మేరకు ఐసీసీ సమాచారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాని ఆమె స్థానంలో తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అలానే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈరోజు ఒకవేళ హర్మన్ మ్యాచ్‌లో ఆడలేకపోతే.. అప్పుడు జట్టులోకి హర్లీన్ డియోల్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ జట్టులో కీలకమైన ఎడమచేతి వాటం స్పిన్నర్ రాధ యాదవ్ కూడా ఫిట్‌గా లేదని మరో వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే.. చావో రేవో మ్యాచ్ కావడంతో పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోయినా.. ఆమెని ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సెమీస్‌లో ఆడబోతుండటం ఇది ఐదోసారి. కానీ ఒక్కసారి కూడా సెమీస్ మ్యాచ్‌లో విజయం సాధించలేదు. 2020లో సెమీస్ గండం దాటినా.. అది వర్షం కారణంగా సెమీస్ మ్యాచ్ రద్దవడంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఫైనల్‌కి వెళ్లింది. కానీ, అక్కడ ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకూ 30 టీ20లు ఆడిన భారత్ ఉమెన్స్ టీమ్ గెలిచింది.. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే.