Asia cup 2023: చెలరేగిన పాక్ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్‌

by Vinod kumar |
Asia cup 2023: చెలరేగిన పాక్ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో పాకిస్తాన్‌ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. సూపర్‌‌-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు దాటికి.. బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌హసన్‌(53) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్‌లో.. హారీస్‌ రౌఫ్‌, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్‌ అహ్మద్‌, అష్రఫ్ చెరో వికెట్‌ సాధించారు.

Advertisement

Next Story

Most Viewed