ధోనీ అభిమానికి హర్భజన్ సింగ్ కౌంటర్.. ట్వీట్ వైరల్‌

by Vinod kumar |
ధోనీ అభిమానికి హర్భజన్ సింగ్ కౌంటర్.. ట్వీట్ వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Finalలో వరుసగా రెండో ఫైనల్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఆసీస్‌తో జరిగిన ఈ మెగా మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పేలవ ప్రదర్శనతో 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో దేశంలో అభిమానం హద్దులు ధాటుతోందని, జట్టు కంటే వ్యక్తిగత ఆటగాళ్ల ఆరాధన ఎక్కువైందని, దాంతో ఐసీసీ టోర్నీల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనే చర్చ జరుతున్నది. గౌతమ్ గంభీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయగా.. హర్భజన్ సింగ్ కూడా ఆ తరహా వ్యాఖ్యలతోనే ఓ ధోనీ అభిమానికి కౌంటరిచ్చాడు. ధోనీ సారథ్యంలోనే టీమిండియా చివరిసారిగా ఐసీసీ టైటిల్ గెలవడంతో అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయారు. తమ అభిమాన క్రికెటరే తోపు అంటూ కామెంట్ చేశారు.

'కోచ్, మెంటార్ లేకున్నా.. టీమ్ మొత్తం కుర్రాళ్లతోనే నిండి ఉన్నా.. సీనియర్లు కూడా వరల్డ్ కప్ ఆడడానికి ఇష్టపడకున్నా.. అంతకుముందు ఒక్క మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినా.. కెప్టెన్ అయిన 48 రోజుల్లోనే ధోనీ టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించాడు.'అని ఓ ధోనీ అభిమాని ట్వీట్ చేయగా.. హర్భజన్ సింగ్ ఘాటుగా బదులిచ్చాడు. 'అవును, భారత్ తరుఫున యువ ప్లేయర్ ధోనీ ఒక్కడే అన్నీ మ్యాచులు గెలిచాడు. మిగిలిన 10 మంది ఆడలేదు. ధోనీనే ఒంటరిగా వరల్డ్ కప్ సాధించాడు. విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మరే ఏ దేశం అయినా వరల్డ్ కప్ గెలిస్తే, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది, ఇంగ్లండ్ వరల్డ్ కప్ సాధించింది అని రాస్తారు. కానీ, మన దేశంలో భారత్ గెలిస్తే, కెప్టెన్ ధోనీ గెలిచాడు, కెప్టెన్ రోహిత్ గెలిచాడు అని కెప్టెన్లకు క్రెడిట్ ఇస్తారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్. గెలిస్తే అందరు కలిసి గెలుస్తారు, ఓడితే అందరు కలిసి ఓడుతారు.'అని హర్భజన్ సింగ్ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed