Breaking: ఆస్తుల వివాదం.. చెల్లి ష‌ర్మిల‌కు జగన్‌ బహిరంగ లేఖ

by srinivas |   ( Updated:2024-10-26 14:17:47.0  )
Breaking: ఆస్తుల వివాదం.. చెల్లి ష‌ర్మిల‌కు జగన్‌ బహిరంగ లేఖ
X

దిశ,వెబ్ డెస్క్: దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి(Late CM Rajasekhar Reddy) ఆస్తుల విషయంలో ఆయన వారసులు వైఎస్ జగన్(YS Jagan), షర్మిల(Sharmila) మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌(Saraswati Power and Industries) ఆస్తుల విషయంలో సోదరుడు జగన్ తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను పలు ఆరోపణలు చేస్తూ వైఎస్ అభిమానులకు ఆమె లేఖ రాశారు.

ఇందుకు స్పందిస్తూ తన సోదరి షర్మిలకు వైఎస్ జగన్ సైతం తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో తన హృదయం బరువెక్కిందని, ఈ మేరకు తాను కూడా లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. ఇటీవ‌ల షర్మిల చేపట్టిన చ‌ర్యలు తన మ‌న‌సును తీవ్రంగా గాయ‌ప‌రిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేసిన అస‌త్య ఆరోప‌ణ‌లు తనకు రాజ‌కీయంగా వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. తన సోదరి ఎంచుకున్న మార్గాన్ని ఆమె విచ‌క్షణ‌కే వ‌దిలేయాల‌నుకుంటున్నానని తెలిపారు. తన పట్ల సానుకూలంగా ఉండి, కోర్టు కేసుల‌న్నీ ప‌రిష్కార‌మైతే షర్మిలకు ఏమి చేయాలో, ఎంత చేయాలో అనే విష‌యాలను ప‌రిశీలిస్తానని లేఖలో జగన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story