- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sex to order: క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటున్నా పిల్లలు పుట్టడం లేదా..? కారణం ఇదే!
ఈ ఆధునిక ప్రపంచంలో గ్లోబల్‌గా అత్యంత ప్రధాన సమస్య వంద్యత్వం(Barrenness). అంటే పిల్లలు పుట్టకపోవడం. దానికి అనేక శారీరక, మానసిక, వైద్య, సామాజిక కారణాలు ఉంటాయి. ఏ రకమైన కుటుంబ నియంత్రణ(family planning) సాధనాలు లేదా మందులు వాడకుండా క్రమం తప్పకుండా శృంగారం(Sex)లో ఒక ఏడాది పాటు పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టకపోవడాన్ని “ప్రాథమిక వంధ్యత్వం” (Primary infertility)అంటారు. చాలా మంది మొదటి కలయికలోనే సంతానం కలుగుతుందని అనుకుంటారు. కానీ అది సరి కాదు. అదే సమయంలో స్త్రీలలో అండం సిద్దంగా ఉండి వీర్య కణాల కదలికలు బాగుంటే ఒక్క కలయికలో కూడా పిల్లలు పుట్టే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. గర్భం రావాలని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళే దంపతులకు 6 నెలలు తిరిగే సరికి నూటికి 63 శాతం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే, 83 నుంచి 85 శాతం మందికి సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా గర్భం(pregnancy) ధరించడానికి నెలలో స్త్రీలో అండం విడుదల అయ్యే సమయంలోనే కలవడం ముఖ్యం. అప్పుడు పురుషుల వీర్య కణాలు సమృద్దిగా ఉండడమే కాక అవి మంచి చురుకైన కదలికలో ఉండడం చాలా ముఖ్యం.
“సెక్స్ టు ఆర్డర్” (Sex to order)ఓ నిర్బంధ చర్య
సాధారణంగా పిల్లలు పుట్టని దంపతులు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. మరీ ముఖ్యంగా స్త్రీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పరీక్షలన్నీ స్త్రీలకే చేయించడం, పురుషుల్లో లోపాలు దాచేందుకు ప్రయత్నించడం, భర్తకు వేరే పెళ్లి చేస్తామని అత్తా మామలు బెదిరించడం, గర్భం ధరించడానికి ఖచ్చితమైన కాల పరిమితిని విధించడం, చుట్టాపక్కలతో పోల్చి గొడ్రాలిగా ముద్ర వేయడం .. ఇలాంటి చర్యలన్నీ స్త్రీలను మరింత మానసిక ఒత్తిడికి, హింసకు లోను చేస్తాయి. శారీరకంగా కూడా హింసను ఎదుర్కునే సందర్భాలలో డిప్రెషన్ మరింత ఎక్కువ అవుతుంది. పిల్లలు పుట్టక పోవడానికి స్త్రీలనే బాధ్యులుగా చేసి హింసించే పురుషస్వామ్య వ్యవస్థ మనది. ఈ ఆందోళన కారణంగా హార్మోన్ల అసమతుల్యత అధికమౌతుంది. ఈ ఒత్తిడి శరీర ధర్మాలలో మార్పులను తీసుకరావడంతో వీర్యోత్పత్తిలో, టెస్టోస్టిరాన్ హార్మోన్ల అండోత్పత్తిలో అపసవ్యతలు ఉత్పన్నం అవుతాయి. ఆత్మన్యూనతతో ఇలాంటి మానసిక ఒత్తిడిలో శృంగారంలో పాల్గొనడం కూడా వీరికి ఒక భారంగా, ఎవరో ఏదో నిర్దేశించడం వల్ల చేసే నిర్భంద చర్యలా, మొక్కుబడి కార్యంలా మాత్రమే మిగిలిపోతుంది. దీన్ని “సెక్స్ టు ఆర్డర్” అంటారు.
పురుషుల్లో ప్రధాన లోపాలు :
పెళ్లి అయినా ఒకసారి కూడా శృంగారం(Sex)లో పాల్గొనక పోవడం వలన సుమారు వందలో 5 శాతం మందికి వంద్యత్వం (barrenness) వచ్చే అవకాశం ఉంటుందని సెక్సాలజిస్ట్ జెఫ్ కాక్ (Sexologist Jeff Cocke)1975 లో చేసిన పరిశోధనల్లో తేలింది. పెళ్లి అయి 15 సంవత్సరాలు దాటుతున్నా శారీరక, హార్మోన్ల తేడాలు ఏమీ లేకపోయినా మానసిక కారణాలు, అవరోధాలు ప్రధానంగా వెజైనిస్మస్(Vaginismus), మానసిక నపుంసకత్వం (Mental impotence)వల్ల సంతానం కలకని దంపతులూ ఉంటున్నారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే పురుషుల్లో శృంగార లోపాలు(Sexual dysfunction in men) ఈ కింది విధంగా ఉంటాయి.
- అంగ స్థంభన లోపాలు (Erectile dysfunctions)
- వీర్య స్ఖలన లోపాలు (Ejaculation disorders)
- వెజైనల్ ఇంటర్ కోర్సు(Vaginal inter course) కంటే ముందే వీర్యం(Semen) వెజైనా(vagina) బయటే స్ఖలించడం వలన అతని లోని తీవ్రమైన ఆందోళన, టెన్షన్, పర్ఫార్మెన్స్, ఆంగ్జైటి కారణాలు.
- అంగం స్థంభించినప్పటి(Penile erection)కి వీర్యం స్కలించక పోవడం. స్త్రీకి గర్భం వస్తుందేమోనన్న భయం పురుషుల్లో ఉండడం లేదా భార్య పట్ల ఒక రకమైన తిరస్కార ధోరణిగా కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు.
- స్ఖలించబడిన వీర్యం మూత్ర ద్వారం ద్వారా బయటకు రాకుండా వెనక్కి మూత్రాశయం లోకి వెళ్ళి మూత్రంలో వెలువడడం.
- వీర్య స్ఖలనం అనేక సార్లు అవడం వలన కూడా వీర్యం పలుచబడి వీర్య కణాల సంఖ్య తగ్గడం
- హస్త ప్రయోగం (Masturbation) ఒక వ్యసనంగా మారి, భార్య వద్ద లైంగికోద్రేకం కలగకుండా ఉండే మనో లైంగిక సమస్యకు గురి కావడం
స్త్రీలలో తలెత్తే సమస్యలు :
- వెజైనిస్మస్ (Vaginismus): సెక్స్ పట్ల, భర్త పట్ల విముఖత, భయం వలన యోని కండరాలు అసంకల్పితంగా తీవ్ర స్థాయిలో సంకోచాలకు గురవడం .. దాని వలన అంగ ప్రవేశం దుర్లభమౌతుంది. పురుషుల అహంకార, దౌర్జన్యపూరిత ధోరణులకు శిక్షగా, తిరస్కారంగా స్రీలు చేసే ప్రతి చర్యగా దీనిని భావించవచ్చు.
- హైమన్ పొర (Hyman membrane) చాలా మందంగా ఉండడం
- డిస్పెరూనియా(Dyspareunia) : నొప్పితో కూడిన సంయోగం, వెజైనిస్మస్ వల్లనో లేదా భర్త దూకుడు, దౌర్జన్య పూరితమైన కలయిక, శృంగార చేష్టల వల్లనో కలిగే నొప్పి వలన ఉత్పన్నం అయ్యే భయం వల్ల కూడా శృంగారాన్ని స్త్రీలు తిరస్కరిస్తారు.
- తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన చాలా మంది స్త్రీలలో అప్పటిదాకా సక్రమంగా వస్తున్న రుతుక్రమంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. లేదా అసలు నెలసరి కాదు. దీన్ని ‘ఆమెనూరియా’(Amenuria) అంటారు.
- యోని(vagina)లో ఊరే ద్రవాల ఆమ్లా, క్షార రసాయనాల పీహెచ్‌లో తేడా కూడా వీర్య కణాలను నాశనం చేస్తాయి. ఈ ద్రవాల సమతుల్యత స్త్రీలు పూర్తి స్థాయిలో శృంగారంలో ఉద్దేపన చెందక పోవడం(Lack of Arousal) వలన ఏర్పడుతుంది. ఈ స్థితి ఉన్నప్పుడు కృత్రిమ రసాయణాలతో తయారయ్యే లూబ్రికేంట్స్ (Lubricants)అంగ ప్రవేశం కోసం యోనిలో వాడితే అవి వీర్య కణాలను నిర్వీర్యం చేసి వంధ్యత్వానికి దారి తీస్తాయి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్