APSRTC:ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Jakkula Mamatha |
APSRTC:ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఉద్యోగాల భర్తీ(Govt Jobs Recruitment) పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ(RTC)లో ఉద్యోగాల భర్తీ(Replacement of jobs)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రకటించింది.

APSRTCలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్(Assistant Mechanic), శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్(Traffic Supervisor)ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ (Supervisor) ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(Junior Assistant Posts) ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed