Aap: మహారాష్ట్ర ఎన్నికలకు ‘ఆప్’ దూరం.. ఎంవీఏ కూటమికి మద్దతు

by vinod kumar |
Aap: మహారాష్ట్ర ఎన్నికలకు ‘ఆప్’ దూరం.. ఎంవీఏ కూటమికి మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించింది. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ (Sanjay singh) సింగ్ శనివారం ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహా వికాస్ అఘాడీ (MVA) కూటమికి ఆప్ మద్దతు తెలపనున్నట్టు తెలిపారు. పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఎంవీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు.

మహారాష్ట్రలో ప్రచారానికి రావాలని ఎంవీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన(UBT), ఎన్సీపీ(ఎస్పీ) నేతలు కేజ్రీవాల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో కేజ్రీవాల్ త్వరలోనే మహారాష్ట్ర(Maharashtra)లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు కూడా క్యాంపెయిన్ చేయనున్నారు. అంతేగాక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) తరపున కూడా కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. కాగా, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 20న పోలింగ్ జరగనుండగా..జార్ఖండ్‌లోనూ అదే నెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed