- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసికూనను మరోసారి చిత్తు చేసిన భారత్.. మూడో టీ-20లో ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: పసికూన జింబాబ్వే జట్టును భారత్ కుర్రాళ్లు మరోసారి చిత్తు చేశారు. ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా బుధవారం హరేరా స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేను 23 పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచులో సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా అధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో గిల్ 66 పరుగులతో కెప్టెన్ ఇన్సింగ్ ఆడగా.. గైక్వాడ్ 49, జైశ్వాల్ 36, శాంసన్ 12 (నాటౌట్) పరుగులు చేశారు.
సెకండ్ మ్యాచ్ సూపర్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరాబానీ, సికందర్జా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 183 పరుగుల భారీ లక్ష్యంగా ఛేదనకు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డియోన్ మైయర్స్ 65, క్లైవ్ మదాండే 37 పరుగులతో చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసిన మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో జింబాబ్వేను దెబ్బకొట్టగా.. అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. తాజా విజయంతో 2-1 తేడాతో సిరీస్‌లో టీమిండియా అధిక్యంలో ఉంది.